వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తాం : పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్హెడ్ వందన పాండే

వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తాం : పంజాబ్ నేషనల్ బ్యాంక్  జోనల్హెడ్ వందన పాండే

నాగర్​కర్నూల్, వెలుగు :  పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ వినియోగదారులు, ఖాతాదారులకు సులభమైన విధానంలో నాణ్యమైన, నమ్మకమైన సేవలందిస్తామని బ్యాంక్​ హైదరాబాద్​ జోనల్​ హెడ్​ జనరల్​ మేనేజర్​ వందన పాండే అన్నారు. నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో కొత్త శాఖ ప్రారంభించడం ద్వారా స్థానికులు, వ్యాపార, వాణిజ్యవర్గాలు, వివిధ సంస్థలకు తమ బ్యాంకు ద్వారా సేవలందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు.  మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్​ హేమంత కేశవ పాటిల్, సర్కిల్​హెడ్ అరవింద్​ కల్ర, మున్సిపల్​ చైర్మన్​ తీగల సునేంద్ర తదితరులతో కలిసి పంజాబ్​ నేషనల్​బ్యాంక్​ 79వ బ్రాంచిని ప్రారంభించారు.

హైదరాబాద్​ సర్కిల్​ పరిధిలో 78 బ్యాంక్​ బ్రాంచిల ద్వారా వినియోగదారులకు సేవలందించడంలో పంజాబ్​ నేషనల్​ బ్యాంకు ముందుందని వారు తెలిపారు. కలెక్టర్​ హేమంత కేశవ పాటిల్​మాట్లాడుతూ పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన కొత్త బ్రాంచి ద్వారా వినియోగదారులకు బ్యాంకింగ్​ సేవలతో పాటు ఆర్థిక, సామాజిక సేవలకు తోడ్పాటునివ్వాలని కోరారు. సర్కిల్​హెడ్​ కల్ర మాట్లాడుతూ వినియోగదారులకు  తమ బ్రాంచిలో ఆధునిక డిజిటల్​ సేవా సదుపాయాలతో పాటు వినియోగదారుల నమ్మకాన్నీ చూరగొనేలా పనిచేస్తామన్నారు. లోకల్​ బ్రాంచి మేనేజర్ హరీశ్​బాబు పాల్గొన్నారు.